POTU WORKERS AND CONTRACT LECTURERS THANK THE TTD CHAIRMAN _ టిటిడి చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపిన పోటు కార్మికులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు
Tirumala, 24 March 2025: The TTD Potu workers and contract lecturers thanked TTD Chairman Sri BR Naidu on Monday evening.
They have formally met him at his camp office in Tirumala and expressed their gratitude for setting up a committee to resolve the problems of the contract lecturers working in TTD educational institutions and also the Potu Workers of Tirumala temple which have been pending for many years.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపిన పోటు కార్మికులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు
తిరుమల, 2025 మార్చి 24: తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన టిటిడి బోర్డు సమావేశంలో పోటు కార్మికులకు జీతాలు పెంపు, టిటిడి విద్యా సంస్థలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుపై పోటు కార్మికులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
టిటిడి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తంచేశారు. చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
తిరుమలలోని టిటిడి ఛైర్మన్ కార్యాలయంలో పలువురు పోటు కార్మికులు, టిటిడి కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.