DIWALI GREETINGS EXTENDED TO PILGRIMS _ టిటిడి ఛైర్మన్, ఈవో దీపావళి శుభాకాంక్షలు
Tirumala, 25 Oct. 19: TTD Trust Board Chairman Sri YV Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal extended Diwali Greetings to the pilgrims and employees.
Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basanth Kumar, CVSO Sri Gopinath Jatti also extended their warm greetings.
They wished that the festival of lights bring brightness in the lives of all the people.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ఛైర్మన్, ఈవో దీపావళి శుభాకాంక్షలు
తిరుమల, 2019 అక్టోబరు 25: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీవారి భక్తులకు, యాత్రికులకు, టిటిడి ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీవారి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. అందరూ ధర్మమార్గంలో నడవడం ద్వారా శ్రీవారి కృపకు పాత్రులు కావాలని ఛైర్మన్, ఈవో కోరారు. టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి కూడా భక్తులకు, యాత్రికులకు, ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.