TTD CHAIRMAN INVITED _ టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వానం

Tirupati, 16 November 2024: TTD Chairman Sri BR Naidu was formally presented the Sri Padmavati Ammavaru Karthika Brahmotsavam invitation by the TTD EO Sri J Syamala Rao on Saturday at Sri Padmavati Rest House in Tirupati.

The nine-day annual event at Tiruchanoor will commence on November 28 and conclude on December 6. 

In this context, TTD Chairman was briefed on the arrangements for Sri Padmavati Ammavari Brahmotsavams. 

The TTD Chairman suggested that precautions be taken keeping in mind the heavy rush of devotees especially on the days of Gaja Vahanam and Panchami Thirtham.  

TTD Additional EO Sri Venkaiah Chowdary, JEO Sri V. Veerabrahmam, CVSO Sri Sridhar and others participated in this program. 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వానం

తిరుపతి, 2024 నవంబరు 16: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు అందించి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో శనివారం అందించారు.

శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి ఛైర్మన్ సూచించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.