DONATION OF RS. 30 LAKHS TO TTD TRUSTS _ టిటిడి ట్రస్టులకు రూ.30 లక్షల విరాళం
Tirupati, April 25, 2026: A total donation of Rs.30 lakhs has been contributed to TTD trusts. Out of this, Rs.10 lakhs each was donated to Sri Venkateswara Annaprasadam Trust, Sri Venkateswara Pranadana Trust, and Sri Padmavathi Children Heart Care Trust.
The donations were made by Mr. Sasapu Srinivas, an IT company owner residing in Texas, USA.
He handed over the DDs to TTD Executive Officer Mr. M. Ravichandra on Saturday at the EO’s office in the TTD Administrative Building in Tirupati.
Chief Engineer Mr. D. Srinivasa Rao from Visakhapatnam and Railway official Mr. Suresh Kumar were also present on the occasion.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ట్రస్టులకు రూ.30 లక్షల విరాళం
తిరుపతి, 2026 ఏప్రిల్ 25: టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాల ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్న ఐటి సంస్థ యజమాని శ్రీ ససపు శ్రీనివాస్ ఈ విరాళాలను అందజేశారు.
ఈ మేరకు డిడిలను టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్రకు శనివారం తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో అందించారు.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన చీఫ్ ఇంజనీర్ శ్రీ డి. శ్రీనివాస్ రావు, రైల్వే అధికారి శ్రీ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల

