టిటిడి డిగ్రీ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

టిటిడి డిగ్రీ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

తిరుపతి, 2022 జనవరి 26: టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ ప‌ద్మావ‌తి డిగ్రీ మరియు పిజి క‌ళాశాల‌, శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల‌, శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆర్ట్స్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో ప్ర‌వేశానికి గాను ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హిస్తున్న‌ట్టు విద్యాశాఖాధికారి శ్రీ గోవింద‌రాజ‌న్ బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు జనవరి 29వతేదీ లోపు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు.

స్పాట్ అడ్మిష‌న్లు పొందిన వారికి హాస్ట‌ల్ సీట్లు, ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఉండవని ఆయన తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.