CLARIFICATION ON TTD GOLD DEPOSITS _ టిటిడి బంగారం డిపాజిట్ల‌పై వివరణ

Tirumala, 18 Oct. 20: At the outset, there is a misleading and malicious statement reported by a section of media on TTD gold deposits. Keeping the Gold, under Gold Deposit Schemes with Public Sector Banks, is carried out by TTD since more than one and a half decades.

The TTD Trust Board has resolved to keep the Gold under Gold Monetisation Scheme of the Central Government so as to earn interest at 2.5%, which is fixed by the Central Government under the said Scheme.

The State Bank of India is the Primary Bank, which undertakes the Gold Deposits under Gold Monetisation Scheme in a big way, which was announced by the Central Government in 2015. Even at present, many banks are not actively coming forward to undertake the long term gold deposit in bulk quantity.

State Bank of India is one of the renowned Public Sector Undertaking Banks in the country. TTD is depositing gold with State Bank of India since more than a decade. TTD holding Gold Deposits of around 7800 kgs with SBI reiterates the fact of long standing banking relationship of TTD with the bank. Even in the 7800 kgs of Gold deposits, the State Bank of India is holding around 4470 kgs since 2017, 920 Kgs since 2018, 1380 kgs since 2019 and the balance is from 2020.

There is no hidden agenda by TTD in making gold deposit with the State Bank of India as the Indian Overseas Bank has not accepted to take it under Long Term Gold Deposit Scheme and informed TTD to return it back. In fact they have requested TTD to give six months time to return the gold and agreed to pay the interest at 2.5%, which TTD otherwise would have earned by placing under long term gold deposit scheme.  In the above circumstances, the same is deposited with State Bank of India.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి బంగారం డిపాజిట్ల‌పై వివరణ

తిరుమల, 2020 అక్టోబరు 18: టిటిడి ఒకటిన్నర దశాబ్దానికి పైగా బంగారాన్ని గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తోంది.

 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 2.5% వడ్డీ ప్రకారం దీర్ఘకాలిక ప్రాతిపదికగానే బంగారాన్ని ఉంచాలని టిటిడి ధర్మకర్తల మండలి తీర్మానించింది.

అయితే, గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో ఎక్కువ మొత్తంలో బంగారం డిపాజిట్లను స్వీకరించే బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానమైనది. ఇప్పటికి కూడా దీర్ఘకాల ప్రాతిపదికన పెద్ద మొత్తంలో బంగారం డిపాజిట్లను స్వీకరించేందుకు చాలా బ్యాంకులు ముందుకు రావడం లేదు.

ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే మొద‌టి స్థానంలో ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇలాంటి స్టేట్ బ్యాంకులో టిటిడి ద‌శాబ్ధ కాలానికి పైగా బంగారం డిపాజిట్లు చేస్తోంది. ఈ బ్యాంకులో దాదాపు 7,800 కిలోల బంగారం డిపాజిట్లు ఉంచ‌డం అన్న‌ది స్టేట్ బ్యాంకుతో టిటిడికి ఉన్న దీర్ఘ‌కాలిక బ్యాంకు లావాదేవీల అనుబంధాన్ని తెలియ‌జేస్తోంది. ఈ 7,800 కిలోల బంగారం డిపాజిట్లను స్టేట్ బ్యాంకులో 2017 నుండి 4,470 కిలోలు, 2018 నుండి 920 కిలోలు, 2019 నుండి 1,380 కిలోలు, అదేవిధంగా 2020 నుండి మిగిలిన మొత్తం బంగారాన్ని డిపాజిట్లుగా పెట్ట‌డం జ‌రిగింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం డిపాజిట్ చేయడం వెనుక ఎలాంటి రహస్య అజెండా లేదు. దీర్ఘకాల ప్రాతిపదికన బంగారం డిపాజిట్లు స్వీకరించేందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంగీకరించలేదు. దీనితో పాటు  ఉన్న బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని మరియు 6  నెలల సమయం కావాలని టిటిడిని కోరింది. ఈ 6 నెలల కాలానికి గాను దీర్ఘకాలిక గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌ కింద ఇతర బ్యాంకులు ఇస్తున్న 2.5% వడ్డీని తాము కూడా 6 నెలలకు చెల్లిస్తామని సదరు బ్యాంకు తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు నిర్ణయించిన మేరకు దీర్ఘకాలిక ప్రాతిపదికగా టిటిడి బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయడం జరిగింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.