WOMEN’S DAY COMPETITIONS HELD _ టిటిడి మహిళా ఉద్యోగులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు
Tirupati, 3 Mar. 21: Essay Writing and Painting Competitions were held for women employees of TTD in view of International Women’s Day.
These competitions conducted at SV Oriental College in Tirupati on Wednesday.
On Thursday there will be singing and quiz competitions in SV Music College and SV Oriental College for Women Employees.
The winners will be given away prizes on International Women’s Day Celebrations which will be observed at Mahati Auditorium on March 8 in Tirupati.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి మహిళా ఉద్యోగులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు
తిరుపతి, 2021 మార్చి 03: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టిటిడిలోని మహిళా ఉద్యోగులకు తిరుపతిలోని ఎస్వీ ప్రాచ్య కళాశాలలో బుధవారం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అదేవిధంగా, మార్చి 4న గురువారం ఎస్వీ సంగీత కళాశాలలో ఉదయం 9 గంటలకు గాత్ర సంగీతం, సాయంత్రం 5 గంటలకు క్విజ్ పోటీలు నిర్వహిస్తారు.
ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మహిళా దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేస్తారు.
వ్యాసరచన పోటీలను ఎస్వీ ప్రాచ్య కళాశాల తెలుగు విభాగాధిపతి శ్రీ కె.లక్ష్మినారాయణ, చిత్రలేఖనం పోటీలను ఎస్వీ శిల్ప కళాశాల అసోసియేట్ లెక్చరర్ శ్రీ హేమంత్ బాబు పర్యవేక్షించారు. నిర్వాహక కమిటీ సభ్యులు డా.వి.కృష్ణవేణి, శ్రీమతి శ్రీవాణి, శ్రీమతి హేమలత, శ్రీమతి భారతి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.