ADMISSION INTO TTD VEDIC SCHOOLS _ టిటిడి వేద పాఠశాలల్లో ప్రవేశాల దరఖాస్తులకు ఆహ్వానం
టిటిడి వేద పాఠశాలల్లో ప్రవేశాల దరఖాస్తులకు ఆహ్వానం
తిరుమల, 2025, మే 16: టిటిడి వేద పాఠశాలలో ప్రవేశాలకు 2025 -26 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించడమైనది. టిటిడి ఆధ్వర్యంలో నడపబడుచున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములు (పాఠశాలలు) 1. వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల 2. కీసరగుట్ట, 3. విజయనగరం, 4. ఐ. భీమవరం, 5. నల్గొండ, 6. కోటప్పకొండ నందు బోధింపబడు వివిధ కోర్సుల్లో ప్రవేశం కొరకు అర్హులైన బాలుర నుండి అనగా వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి మరియు నిర్ణీత వయస్సు, విద్యా ప్రమాణాలు కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
సదరు పాఠశాలల యందు బోధింపబడు వివిధ కోర్సుల వివరాలు, అర్హత, ఆవశ్యకత, దరఖాస్తు మరియు ఇతర వివరాలకు టిటిడి వెబ్ సైట్ www.tirumala.org నందు తిలకించవచ్చును. 2025 మే 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.