THOUSANDS HAVE UTTARA DWARA DARSHAN IN LOCAL TEMPLES  _ టిటిడి స్థానిక ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి

TIRUPATI, 30 DECEMBER 2025: Thousands of devotees thronged local temples and have Uttara Dwara Darshanam on the auspicious occasion of Vaikuntha Dwara Darshanam on Tuesday.

The TTD run temples including Tiruchanoor, Appalayagunta, Srinivasa Mangapuram, Kodanda Ramalayam, Govindaraja Swamy, Alipiri Padalu,  Vontimitta, Narayanavanam, Nagari, Nagulapuram, Keelapatla, Vakulamata temples witnessed huge turnout of devotees.

In all these temples the Dwara Darshanam commenced after a series of Kainkaryams during early hours on Tuesday.

Approximate head count

At Tiruchanoor – 32,000

Srinivasa Mangapuram-45000

Appalayagunta-27000 

Kodanda Ramalayam-12thousands

Over 50 thousand in Vontimitta, Konetiraya Swamy at Keelapatla around 30000

TTD has made elaborate arrangements and spruced up the temples with flowers to match the occasion.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టిటిడి స్థానిక ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి

  విశేషంగా దర్శించుకున్న భక్తులు

తిరుపతి, 2025 డిసెంబరు 30: టిటిడి స్థానిక ఆలయాలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మంగ‌ళ‌వారం ఘనంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు దర్శించుకున్నారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా తెల్ల‌వారుజామున 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. ఉద‌యం 3 గంట‌ల నుండి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమతించారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఆస్థానం జరిగింది. రాత్రి 8 గం.ల వరకు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో 32 వేలకు పైగా భక్తులు శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. 

శ్రీనివాసమంగాపురంలో

          

శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో  ధనుర్మాస కైంకర్యాల అనంతరం  వేకువజామున 1.35 గంటల నుండి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. రాత్రి 8 గం.ల వరకు దాదాపు 40 వేలు పైచిలుకు భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 

ద్వాదశి సందర్భంగా బుధవారం కూడా ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.

అప్పలాయగుంటలో ….

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వేకువ జామున 3 నుండి 4 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 5 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.  సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు.దాదాపు 25,720 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

జ‌న‌వ‌రి 3న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 7 నుండి 8 గంటల వరకు  స్నపన తిరుమంజనం,  చక్రస్నానం నిర్వహించనున్నారు.

అదేవిధంగా, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 17 వేల పైచిలుకు,  కీలపట్ల శ్రీ కోనేటి రాయ స్వామి ఆలయంలో 28 వేలకు పైగా, కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో 14,500 మంది భక్తులు, పుంగనూరులో శ్రీ కల్యాణ వేంకటరమణ స్వామి ఆలయాన్ని 30,990 మంది భక్తులు, దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని  46వేలకు పైగా, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని 50,402 భక్తులు, నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని 34, 679 మంది, జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని 27,344 మంది భక్తులు, నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం టిటిడి ఆలయాల్లో అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. 

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.