టి.ఏ.పి.నారాయణ సేవలు మరువలేనివి : తితిదే తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
టి.ఏ.పి.నారాయణ సేవలు మరువలేనివి : తితిదే తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
తిరుపతి, జూన్ 29, 2013: తిరుమల తిరుపతి దేవస్థానంలో 34 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేస్తున్న ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి(జనరల్) శ్రీ టి.ఏ.పి.నారాయణ సేవలు మరువలేనివని తితిదే తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు కొనియాడారు. జూన్ 30న ఈయన పదవీ విరమణ చేయనున్న సందర్భంగా శనివారం తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో వీడ్కోలు సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ నారాయణ ఏ విభాగంలో పనిచేసినా దానికి వన్నె తెచ్చేలా కృషి చేశారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి కింది స్థాయి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆచార్య పురుషుల పరంపరకు చెందిన వారు కావున తిరుమల శ్రీవారి ఆలయంతో ఈయనకు ప్రత్యేక అనుబంధం ఉందని వివరించారు.
అనంతరం జెఈవో శ్రీ శ్రీనివాసరాజు ఆయన్ను దుశ్శాలువ, స్వామివారి మెమొంటో, శ్రీవారి ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనకు అందాల్సిన మొత్తాన్ని చెక్కు రూపంలో అందించారు.
అదేవిధంగా తితిదే పరకామణి సూపరింటెండెంట్ శ్రీ శ్రీధర్, తితిదే కేంద్రీయ వైద్యశాలలో ఎంఎన్ఓగా పని చేస్తున్న శ్రీ టి.దాసు ఉద్యోగ విరమణ సందర్భంగా జెఈవో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తితిదే డెప్యూటీ ఈవోలు శ్రీ చిన్నంగారి రమణ, శ్రీ మునిరత్నంరెడ్డి, శ్రీ బాలాజి, శ్రీ ఇ.సి.శ్రీధర్, శ్రీమతి చెంచులక్ష్మి, శ్రీమతి బేబి సరోజిని, శ్రీమతి వనజ, ఇతర ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.