Rs. 2.50 CRORE DONATION TO TTD _ టీటీడీకి రూ.2.50 కోట్లు విరాళం

Tirumala, 23 January 2026: Hyderabad based P. L. Raju Constructions Limited on Friday donated Rs.2.50 crore to various trusts of TTD.

The donations include Rs. 75 lakh each to Sri Venkateswara Pranadana Trust and Sri Venkateswara Vidyadana Trust, Rs.50 lakh to the BIRRD Trust, Rs.25 lakh each to the Sri Venkateswara Annadanam Trust, and  Sri Venkateswara Go Samrakshana Trust.

On this occasion, the company’s representative Sri Raja Gopala Raju handed over the donation DDs to the TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in the Srivari Temple.

TTD Board Member Sri Bhanu Prakash Reddy and Temple Dy EO Sri Lokanatham were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.2.50 కోట్లు విరాళం

తిరుమల, 2026 జనవరి 23: హైదరాబాద్ కు చెందిన పి.ఎల్.రాజు కన్ట్స్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది.

ఇందులో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళంగా అందించింది.

ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి శ్రీ రాజ గోపాల రాజు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.