FERTILISERS DONATED _ టీటీడీకి రూ.4.10 లక్షల విలువైన ఎరువులు విరాళం
TIRUMALA, 12 AUGUST 2024: Renowned Fertilizers, the Coromandel International Company has donated Rs. 4.10 lakh worth fertilizers to the Garden wing of TTD on Monday.
The vice president of the firm Sri Satyanarayana, RM Sri Murali handed over the stock to the Garden Dy Director.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.4.10 లక్షల విలువైన ఎరువులు విరాళం
తిరుమల, 2024 ఆగస్టు 12: టీటీడీ ఉద్యానవన విభాగానికి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వారు రూ.4.10 లక్షల విలువైన ఎరువులను సోమవారం విరాళంగా అందించారు.
కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సత్యనారాయణ, ఆర్ఎం శ్రీ రమణారెడ్డి, మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ మురళి ఈ మేరకు ఎరువులను తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగం కార్యాలయంలో డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులుకు అందజేశారు. తిరుమల, తిరుపతిలోని ఉద్యానవనాల్లో మొక్కల పెంపకానికి ఈ ఎరువులను వినియోగిస్తారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీ మధు, శ్రీ అనిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.