DONATION OF TWO WHEELERS TO TTD _ టీటీడీకి రెండు ద్విచక్ర వాహనాలు విరాళం

Tirumala, February 11, 2025: The representatives of Chennai-based TVS and Bangalore-based NDS Eco, donated electric two-wheelers respectively at Tirumala on Tuesday. 
 
The price of the iCube X vehicle is Rs.2.70 lakhs, while the price of the NDS Eco is Rs.1.56 lakh.
 
First, the priests performed special pooja for these two.  Later, the representatives of the respective organizations handed over the vehicle keys to TTD Additional EO Sri. Ch Venkaiah Chowdary.
 
TVS Chairman Sri Venu Srinivasan, MD Sri Sudarshan, Tirumala DI Sri Subramaniam, NDS Eco Chairman MH Reddy and others participated in this programme.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రెండు ద్విచక్ర వాహనాలు విరాళం

తిరుమల, 2025 ఫిబ్రవరి 11: తిరుమల శ్రీవారికి మంగళవారం చెన్నైకి చెందిన టివిఎస్, బెంగళూరుకు చెందిన ఎన్ డిఎస్ ఎకో సంస్థల ప్రతినిధులు విద్యుత్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు.

టీవీఎస్ ఐ క్యూబ్ ఎక్స్ వాహనం ధర రూ.2.70 లక్షలు, ఎన్ డిఎస్ ఎకో వాహనం ధర రూ.1.56 లక్షలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆయా సంస్థల ప్రతినిధులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీవిఎస్ చైర్మన్ శ్రీ వేణు శ్రీనివాసన్, ఎండి శ్రీ సుదర్శన్, తిరుమల డిఐ శ్రీ సుబ్రమణ్యం, ఎన్ డిఎస్ ఎకో సంస్థ చైర్మన్ ఎంహెచ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.