BUSES DONATED _ టీటీడీకి రెండు బస్సులు విరాళం

TIRUMALA, 01 DECEMBER 2023: TTD received two buses as a donation on Friday morning. Sri Satyanarayana, President of Chennai-based SRM University, Executive Director Prof. Narayana Rao handed over two buses worth around Rs.80 lakhs.

They handed over the keys to the TTD EO Sri AV Dharma Reddy in front of Srivari Temple.

TTD Transport Department GM Sri. Sesha Reddy and Tirumala DI Sri. Janakirami Reddy participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రెండు బస్సులు విరాళం
 
తిరుమల, 2023 డిసెంబర్ 01: టీటీడీకి శుక్రవారం ఉదయం రెండు బస్సులు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ శ్రీ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు  బస్సులను అందజేశారు. 
 
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, తిరుమల డిఐ శ్రీ జానకిరామరెడ్డి పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.