DARSI MLA DONATES 25 SAHIWAL COWS _ టీటీడీకి 25 సాహివాల్ జాతి గోవులను విరాళంగా అందించిన దర్శి ఎమ్మెల్యే శ్రీ వేణుగోపాల్
Tirupati, 24 February 2024: Sri M Venugopal, MLA from Darsi, Prakasam district has donated 25 Gir- Sahiwal breed desi cows to TTD on Saturday in the presence of TTD Chairman Sri Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy at SV Gosala in Tirupati.
Speaking on the occasion TTD Chairman said to meet the ghee needs of 30 kgs per day in Srivari temple for daily Kainkaryams, TTD needs 500 desi cows in addition to its existing stock of desi bovines.
Thereafter both the Chairman and EO performed special Pujas to the donated desi cows and fed them fodder.
Later they also facilitated the donor couple with Srivari Theertha Prasadams.
SV Goshala Director Dr Harinath Reddy and other officials were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
టీటీడీకి 25 సాహివాల్ జాతి గోవులను విరాళంగా అందించిన దర్శి ఎమ్మెల్యే శ్రీ వేణుగోపాల్
తిరుపతి, 24 ఫిబ్రవరి 2024: ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ టీటీడీకి గుజరాత్‌కు చెందిన 25 సాహివాల్ జాతి గోవులను విరాళంగా అందజేశారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డితో పాటు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి నైవేద్యానికి రోజుకు 30 కిలోల నెయ్యి అవసరమవుతుందని, ఇందుకోసం టీటీడీలో ఉన్న గోవులతోపాటు మరో 500 దేశీయ గోవులు అవసరమవుతాయని తెలిపారు. ఇందులో భాగంగా దర్శి ఎమ్మెల్యే శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ గతంలో 25 గిర్ జాతి గోవులను విరాళంగా అందించారని వివరించారు.
అనంతరం ఛైర్మన్, ఈవో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి దాణా అందించారు. తరువాత దాత ఎమ్మెల్యే శ్రీ వేణుగోపాల్ దంపతులను ఛైర్మన్, ఈవో కలిసి ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ గో శాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.