ALLEGATIONS MADE BY FORMER TTD CHAIRMAN BHUMANA KARUNAKAR REDDY AGAINST TTD ARE COMPLETELY FALSE – TTD _ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి టీటీడీ పై చేసిన ఆరోపణలు అవాస్తవాలు, అభూత కల్పనలే

Tirumala, 20 June 2025: TTD has seriously refuted the allegations by former TTD Chairman Sri Bhumana Karunakara Reddy against TTD and also condemned for mudslinging the organization without concrete evidence.

”It is completely untrue to say that an attempt is being made to undermine the generations of Vedic recitation in the Srivari temple and to speak derisively of the Vedic reciters. 

At present the duration of Vedic recitation in Srivari temple is not only increased but also fully stabilized now. 

From the past one year, TTD made it prominent that the divine chant, ”Om Namo Venkatesaya” also be heard and echoed everywhere in Srivari Temple, outside, on both footpaths, Kalyana Katta, Srivari Seva, outside queue lines, Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex etc.

TTD is also taking steps to increase the physical and mental strength of Vedic students in Vedic schools 

The allegations that the temple priests are not properly treated or given respect are also completely false.  They always have the respect given to them. However, many reforms have been brought about inside the temple in recent times. 

Inside the temple also TTD started the process of collecting opinions from the devotees on darshan, tirtha prasadams, etc. and laid emphasis on transparency in the system.  Devotees are also praising this innovative approach of TTD.

 3. Notices to several Mutts

The allegation regarding issuing notices to several mutts in Tirumala is also completely untrue.  

Everyone in the country is bound to Law. Following the court orders, notices were issued to Visakha Sharada Peetham and one or two other Mutts for encroaching more space than the land allocated by TTD to them. 

All the mutts are also appreciating the reforms brought by TTD in the last year. TTD has also given permission to several Mutts for repairs and modernization as per norms.

 5. AI technology

It would be good to know the facts before speaking falsely that they are stopping the devotees by saying that they will provide Srivari darshan within a couple of hours with AI technology. 

From the past one year TTD has brought many reforms focussing on providing hassle free darshan to the multitude of devotees visiting Tirumala.

TTD has been analyzing the situation from time to time like never before and perfectly following the time management in a scientific manner in maintaining the queues.

An additional 22 food counters have also been set up for the devotees who are waiting in the queue lines outside serving a Annaprasadams, milk, tea, coffee, buttermilk and snacks according to the time line.

With a systematic action plan, comfortable darshan to record number of devotees is being provided on Thursdays, Fridays, Saturdays and Sundays like never before.

To provide enhanced services to the pilgrims feedback from devotees is being received in three different modes.

It is remarkable that more than 90 percent of the devotees have expressed their satisfaction with the services being provided by TTD such as Annaprasadam, accommodation, drinking water, laddu prasadams, etc., from the feedback collected through IVRS, WHATSAPP, and Srivari Sevaks.

TTD is making all efforts to make darshan through Artificial Intelligence possible soon.

 6. Scrutiny at Parakamani

In 2023 after a scandal in Parakamani came to light, an armoured system was put in place since last one year.

A SoP in Parakamani to restore the lost trust in the system was prepared.

As per the SoP, anyone entering Parakamani will have to undergo security checks and thorough scrutiny.  

When the facts are like this, it is inappropriate on the part of former TTD Chairman to make false allegations against the world renowned Hindu spiritual organization of TTD.  

One should properly check the facts before throwing allegations.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి టీటీడీ పై చేసిన ఆరోపణలు  అవాస్తవాలు, అభూత కల్పనలే

నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా సంస్థ మీద బురద జల్లడం శోచనీయం.

తిరుమల, 2025 జూన్ 20: శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని, వేద పారాయణదారులతో అవహేళనగా మాట్లాడటం అన్నది పూర్తిగా అవాస్తవం. 

ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుండా ప్రస్తుతం పూర్తిస్థాయిలో  స్థిరీకరించడం కూడా జరిగింది. 
 
శ్రీవారి ఆలయంలో గానీ, వెలుపల గానీ, ఉభయ కాలిబాట మార్గాల్లో, కళ్యాణ కట్ట, శ్రీవారి సేవ, బయట క్యూలైన్లు, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తదితర ప్రాంతాల్లో కూడా ఒక సంవత్సర కాలంగా ఓం నమో వేంకటేశాయ నామాన్ని అన్ని చోట్లా ప్రతిధ్వన్వించేలా ఏర్పాటు చేశాం.

వేద పాఠశాలల్లో వేద విద్యార్థులకు శారీరక – మానసిక దృఢత్వం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం 

2.అర్చకులను తనిఖీ చేయడమన్నది పూర్తిగా వాస్తవ దూరం

అర్చకులకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. వారికి ఇచ్చే గౌరవం వారికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆలయం లోపల ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. 
ఆలయం లోపల కూడా భక్తుల నుండి దర్శనాలు, తీర్థ ప్రసాదాలు, తదితర అంశాలపై అభిప్రాయ సేకరణ విధానాన్ని ప్రారంభించి పారదర్శకతకు పెద్దపీట వేశాం. ఈ విధానంపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.
 
3.పలు పీఠాధిపతులకు నోటీసులు

ఇది కూడా పూర్తిగా అవాస్తవం. గతంలో టీటీడీ కేటాయించిన స్థలానికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకు కోర్టు ఆదేశాలు ప్రకారం విశాఖ శారదా పీఠం, మరో ఒకటి రెండు మఠాలపై నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి.

గత సంవత్సర కాలంలో టీటీడీ తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలకు అన్ని మఠాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి. టీటీడీ కూడా పలు మఠాలకు నిబంధనల ప్రకారం మరమ్మతులు, ఆధునీకరణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

5.ఏఐ టెక్నాలజీ

ఏఐ టెక్నాలజీతో దర్శనం చేయిస్తామని చెప్పి భక్తులను అడ్డుకుంటున్నారని అవాస్తవాలు పలికే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది‌. 

గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్ధతిలో సమయ పాలన పాటిస్తూ, క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నాం.

బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు 22 ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్న ప్రసాదాలు, పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ ను విధిగా టైమ్ లైన్ ప్రకారం అందిస్తూ వస్తున్నాం.

చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అత్యధిక స్థాయిలో గురు, శుక్ర, శని, ఆది వారాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలను అందిస్తున్నాం.

టీటీడీ అందిస్తున్న వివిధ సౌకర్యాలపై మూడు విధాలుగా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. 

IVRS, WHATSAPP, శ్రీవారి సేవకులు ద్వారా సేకరిస్తున్న అభిప్రాయాల్లో 90 శాతానికి పైగా భక్తులు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాద, వసతి, తాగునీరు, లడ్డూ ప్రసాదాలు, తదితర సేవలపై సంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం.

ఇక ఏఐ ప్రాజెక్టు సాకారం కావడానికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోంది.

6.పరకామణిలో తనిఖీ

2023 సంవత్సరం పరకామణిలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఏర్పడిన అపవాదును తొలగించడానికి ఒక సంవత్సర కాలంగా ఒక పకడ్బందీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగింది. 

ఈ వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని పున:స్థాపించేలా పరకామణిలో SoP తయారు చేశాం.

ఎవరైనా పరకామణిలో ప్రవేశించాలంటే ఈ SoP లో పేర్కొన్న విధంగా భద్రతా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇంతటి పకడ్బందీ వ్యవస్థ వల్ల గత సంవత్సర కాలంగా పరకామణిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.

వాస్తవాలు ఈ విధంగా వుండగా సదరు మాజీ చైర్మన్ ఆధ్యాత్మిక సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని తెలియజేస్తున్నాం . వ్యవస్థపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నాం.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.