AADHAR LINK OF TTD APPLICATIONS TO END MIDDLE MEN MENACE: TTD EO _ టీటీడీ ఆన్లైన్ అప్లికేషన్లకు ఆధార్ అనుసంధానం ద్వారా దళారీ వ్యవస్థ నియంత్రణ – టీటీడీ ఈవో జె.శ్యామలరావు
During a review meeting held with UIDAI officials along with TCS, Jio and TTD IT wing at the conference hall of TTD administrative buildings on Saturday,
the EO explained that TTD had initiated online services for srivari Darshan, rooms, Arjita Sevas, donations, and srivari Seva voluntary service with an aim to give an opportunity to a wide range of devotees spread across the globe in a transparent manner.
However, these online services were often exposed to middle men menace which could be resolved only through Aadhar linkage.
He directed IT officials to update the feasibility on Aadhar linkage of all TTD services in coordination with UIDAI authorities.
He also discussed in detail the issues like pilgrims identity verification, biometric verification, spotting Aadhar duplication and many others.
Earlier the UIDAI officials presented a PPT on various aspects of Aadhar application linkage.
UIDAI Deputy Director Smt Sangeeta,other UIDAI officials Sri Srinivas, Smt Rajashree Gopalakrishna, Sri Chowdhary,Sri Sanjiv Yadav, TTD officials including JEOs
Smt Gautami, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, Transport General Manager Sri Sesha Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీ ఆన్లైన్ అప్లికేషన్లకు ఆధార్ అనుసంధానం ద్వారా దళారీ వ్యవస్థ నియంత్రణ – టీటీడీ ఈవో జె.శ్యామలరావు
తిరుపతి, 2024 జూన్ 29: శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం యుఐడిఎఐ (ఆధార్ సంస్థ) నుండి విచ్చేసిన అధికారులు, టిసిఎస్ జియో, టీటీడీ ఐటి విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. అయితే ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడద తప్పడం లేదని, వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటి అధికారులను ఈవో ఆదేశించారు. ఇందుకు సంబంధించి యుఐడిఎఐ అధికారుల సహకారాన్ని తీసుకోవాలన్నారు.
ఆధార్ ద్వారా యాత్రికుల యొక్క గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు.
అంతకుముందు యుఐడిఎఐ అధికారులు ఆధార్ ను ఏ విధంగా అప్లికేషన్ లకు లింక్ చేయవచ్చు, తదితరాంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో యుఐడిఎఐ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి సంగీత, అధికారులు
శ్రీ శ్రీనివాస్, శ్రీమతి రాజశ్రీ గోపాలకృష్ణ, శ్రీ అనుకూర చౌదరి, శ్రీ సంజీవ్ యాదవ్, టీటీడీ జేఈఓలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీమతి గౌతమి, సివి అండ్ ఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, రవాణా విభాగం జనరల్ మేనేజర్ శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.