TTD EO REVIEWS TTD RELIGIOUS PROJECTS _ టీటీడీ ఆల్ ప్రాజెక్టులపై ఈవో సమీక్ష సమావేశం
Tirupati, 29 August 2025: The TTD EO Sri J. Syamala Rao held a review meeting on the functioning of all religious projects under the auspices of TTD on Friday at his chambers in the TTD administration building in Tirupati.
Speaking on the occasion, the EO suggested that state-level competitions should be organized to widely introduce Annamacharya sankirtans to the public and that auditions should be conducted in advance.
Similarly, he said that special steps should be taken for research on Annamacharya literature in colleges and universities.
He instructed the officials to devise innovative programs to instil a passion for Annamacharya kirtans among children and youth.
He instructed to start new programs under the auspices of Hindu Dharma Prachara Parishad.
To bring back the former glory to Harikatha, the officials were asked to take steps to organize the \’\’Harikatha Vaibhavam\’\’ program to be organized on the 31st of this month in a grand manner.
An annual calendar with devotional cultural events should be prepared for each project and devotional programs should be organized regularly in all TTD temples.
He also asked to come out with an action plan to organize Srinivasa Kalyanas in tribal areas.
JEO Sri Veerabrahmam and other project officials participated in this review meeting.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీ ధార్మిక ప్రాజెక్టులపై టీటీడీ ఈవో సమీక్ష
తిరుపతి, 2025 ఆగస్టు 29: టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల పని తీరుపై టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల తన కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర స్థాయి కాంపిటీషన్లు నిర్వహించాలని, అందుకు ముందస్తుగా ఆడిషన్లు చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా అన్నమయ్య సాహిత్యాన్ని కళాశాలలు,విశ్వవిద్యాలయలలో పరిశోధనలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు, యువత లో అన్నమయ్య కీర్తనలు పట్ల మక్కువ పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు రూపొందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సరి కొత్త కార్యక్రమాలను ప్రారంభించాలని ఆదేశించారు.
హరికథకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ నెల 31న నిర్వహించబోయే \’\’హరికథ వైభవం\’\’ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రతి ప్రాజెక్ట్ కు ఈవెంట్స్ తో కూడిన వార్షిక క్యాలెండర్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
అన్ని టీటీడీ ఆలయాలలో క్రమం తప్పకుండా సాంస్కృతిక, ఆధ్యాత్మిక , భక్తి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
గిరిజన ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.
ఎస్‌వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ద్వారా అన్నమయ్య కీర్తనలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి యువతకు చేరువ చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఇతర ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు.



