టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్
టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్
తిరుపతి, 2026 జూలై 25: హర్యానాలోని కురుక్షేత్ర శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అసిస్టెంట్ షరాఫ్‌గా పనిచేస్తున్న పి. గిరి అనే ఉద్యోగిని శనివారం టీటీడీ సస్పెండ్ చేసింది.
సదరు ఉద్యోగి టీటీడీ పేరుతో అన్నదానం, కల్యాణోత్సవం, వాహన సేవల పేరుతో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది.
ఈ నేపథ్యంలో సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
