HOUSE SITES FOR ALL TTD EMPLOYEES- TTD CHAIRMAN _ టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పిస్తాం- టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

 * ACCOMPANIED BY TTD EO VISITS HOUSE SITE LOCATION- VADAMALAPETA VILLAGE

Tirupati,15, August,2023: TTD Chairman Sri Bhumana Karunakar Reddyon Tuesday reiterated his assurance to TTD employees that he will ensure house sites to each and every employee and that should unitedly support the temple management to serve devotees.

Along with the TTD EO and JEOs and employees union leaders, he visited the Vadamalapeta forest village where 310 acres of land have already been allocated for house sites to TTD employees associations.

Speaking on the occasion the TTD chairman said if necessary another 100 acres will be acquired and the house sites would be distributed to all employees by honourable AP CM Sri YS Jaganmohan Reddy on September 18.

As employee leaders and others greeted the announcement with happiness and clapping, the TTD chairman said along with the AP CM he wished to maintain cordial relations with the TTD employees.

He reminded me that the process of house site allotments to TTD employees began by him during the DrYSR regime which was bearing fruit now

TTD EO Sri AV Dharma Reddy said in all 7000 employees would get 35×55 feet sites and launch a township accruing high value for land on the Chennai highway. 

On the directions of the TTD chairman the town planning permission will be procured with the demarcation of house sites, layouts kuccha roads etc. The Chairman cum local MLA Sri Karunakar Reddy’s dedicated efforts made this possible.

TTD Chief Engineer Sri Nageswar Rao, SEs Sri Jagdeeswar Reddy, Sri Satyanarayana, Sri Venkateswarlu, Dyeo of TTD welfare department Smt Snehalata, EE Sri Narasimha Murthy were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పిస్తాం

– టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

– ఈవోతో కలిసి వడమాలపేట వద్ద ఉన్న ఇంటిస్థలాల పరిశీలన

తిరుపతి, 2023 ఆగస్టు 15: టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగులు అంతర్గత ఇబ్బందులు విడనాడి ఏకంగా తమకు సహకరించాలని ఆయన కోరారు. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం మంజూరు చేసిన 310 ఎకరాల భూమిని ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో కలసి మంగళవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు18వ తేదీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇంటిస్థలాల పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు. అవసరమైతే మరో 100 ఎకరాలైనా ప్రభుత్వం నుండి సేకరించి అందరికీ ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. ఈ ప్రకటనతో ఉద్యోగులు ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, తాను ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకునే వారమని శ్రీ కరుణాకర్ రెడ్డి చెప్పారు. దివంగత సి ఎం డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తన కృషితో ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పదేళ్ళపాటు ఈ సమస్యను ఎవరూ పట్టించుకోని విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన చెప్పారు .
శ్రీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే మళ్ళీ ఉద్యోగులందరికీ ఇంటిస్థలాలు వస్తున్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు 35×55 అడుగుల ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. దాదాపు 7 వేల మంది ఉద్యోగులకు ఇక్కడ ఇంటి స్థలాలు రావడంతో పెద్ద టౌన్ షిప్ తయారవుతుందన్నారు. చెన్నై హైవే పక్కనే ఈ స్థలం ఉండడంతో మంచి ధర పలుకుతోందన్నారు. ఛైర్మన్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 18 లోపు ఈ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి, కచ్చారోడ్లు వేసి తుడా అనుమతి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఎమ్మెల్యే శ్రీభూమన కరుణాకర రెడ్డి పట్టుదల, కృషి తోనే ఉద్యోగులకు ఇంటిస్థలాలు వస్తున్నాయని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇలు శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, ఈ ఈ శ్రీ నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.