JEO(H&E) REVIEWS ON EMPLOYEES BANK ELECTIONS _ టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు ఎన్నిక‌లకు ఏర్పాట్లు పూర్తి చేయండి – అధికారుల‌కు టీటీడీ జేఈవో ఆదేశం

Tirupati, 25 October 2024: TTD JEO for Health and Education Smt Gautami has directed the officials to complete the arrangements for the TTD Employees Co-operative Credit Society Limited (TTD Employees Bank) elections to be held on October 28. 

Addressing a review meeting with the  officials at the TTD administration building on Friday, she said that election centers  shall be set up at SV High School in Tirumala and S.G.S. High School in Tirupati to facilitate employees working at both places for casting their votes.

She also directed that a separate polling centre shall be set up for the disabled on the ground floor. 

She said the votes could be exercised from 7 am to 2 pm and every employee should  bring their original ID card and Cell phones will not be allowed in the election center and should be  deposited separately.

Among others She instructed that  electricity officials to arrange generators and PA system, the vigilance department to install CCTVs and coordinate with security guards and local police while the TTD IT department to arrange for smooth and hassle free voting.

District Co-operative Officer Smt Lakshmi, Election Officer Sri Srinivas Umapathy, Smt Jhansi, TTD Welfare Officer Sri Anandaraju, SEs Sri  Manoharam, Sri Venkateswarulu, VGO Smt Sadalakshmi, Health Officer Smt Asha Jyoti, CMO Dr Narmada and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు ఎన్నిక‌లకు ఏర్పాట్లు పూర్తి చేయండి – అధికారుల‌కు టీటీడీ జేఈవో ఆదేశం

తిరుప‌తి, 2024 అక్టోబ‌రు 25: ఈనెల 28వ తేది నిర్వ‌హించ‌నున్న టీటీడీ ఎంప్లాయిస్ కో-ఆప‌రేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌(టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు) ఎన్నిక‌లకు ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని టీటీడీ జేఈఓ (విద్య‌&ఆరోగ్యం) శ్రీ‌మ‌తి గౌత‌మి అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో సంబంధిత అధికారుల‌తో జేఈవో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లోని ఎస్వీ హైస్కూల్‌, తిరుప‌తిలోని ఎస్‌.జీ.ఎస్‌.హైస్కూల్ లో ఎన్నిక‌ల కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. తిరుమ‌ల‌లో ప‌ని చేసే ఉద్యోగులు ఎస్వీ హైస్కూల్ లో, తిరుప‌తి, ఇత‌ర ప్రాంతాల్లో ప‌ని చేసే ఉద్యోగులు ఎస్‌.జీ.ఎస్ హైస్కూల్ లో ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌న్నారు.

దివ్యాంగుల‌కు గ్రౌండ్ ఫ్లోర్ లో ప్ర‌త్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల‌న్నారు. ఉద‌యం 7 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌చ్చ‌ని చెప్పారు. ఓటు వేసేందుకు వ‌చ్చే ప్ర‌తి ఉద్యోగి త‌మ ఒరిజిన‌ల్ ఐడీ కార్డు త‌ప్ప‌న‌స‌రిగా తీసుకు రావాల‌ని అన్నారు. ఎన్నిక‌ల కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమ‌తించ‌బ‌డ‌వ‌నీ, సెల్ ఫోన్ల డిపాజిట్ కు ప్ర‌త్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేయాల‌న్నారు.

అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు జ‌న‌రేట‌ర్లు, మైకుల‌ను అందుబాటులో ఉంచుకుని ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్ట‌మ్ కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేయాల‌న్నారు. విజిలెన్స్ విభాగం సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకుని సెక్యూరిటీ గార్డుల‌తో పాటు స్థానిక పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆదేశించారు. అలాగే టీటీడీ ఐటీ విభాగం, ఇంజినీరింగ్, సెక్యూరిటీ విభాగాల‌కు త‌మ విధుల‌పై దిశానిర్దేశం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కోఆప‌రేటివ్ అధికారి శ్రీ‌మ‌తి ల‌క్ష్మి, ఎన్నిక‌ల అధికారి ఉమాప‌తి, శ్రీ‌మ‌తి ఝాన్సీ, వారి సిబ్బంది ,టీటీడీ వెల్ఫేర్ అధికారి ఆనంద‌రాజు, ఎస్ఈలు మ‌నోహ‌రం, వేంక‌టేశ్వ‌రులు, వీజీఓ స‌దాల‌క్ష్మి, హెల్త్ ఆఫీస‌ర్ ఆశాలత,సీఎంవో Dr.న‌ర్మ‌ద‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.