STRIVE FOR NBA RECOGNITION TO SPW POLYTECNIC- TTD JEO (H & E) _ టీటీడీ ఎస్‌పిడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్‌బిఏ గుర్తింపునకు కృషి చేయాలి-జెఈవో శ్రీమతి సదా భార్గవి
Tirupati, 25 June 2022: TTD JEO (H&E) Smt Sada Bhargavi on Saturday directed officials to expedite procedures to procure National Board of Accreditation recognition to the Sri Padmavati Women Polytechnic.
Addressing a review meeting with all TTD college principals and Headmasters of schools at the conference hall of TTD administrative building on Saturday evening, the TTD JEO said since the NBA team was visiting the TTD educational institution in July last week the engineering and other department officials should speed up concerned works to enhance the basic amenities.
She also gave valuable suggestions on improving the ambience of classrooms, hostel rooms, painting works, signages, IT classrooms, labs modernisation, greenery etc.
She said DyEO of Manuscripts wing Smt Vijayalakshmi and SVETA Director Smt Prashanti have been appointed as OSDs for overseeing works of Regular schools and Special Merit drive schools respectively.
Exhorting officials to improve the quality of education in TTD educational institutions, she asked principals and headmasters to interact with parents of students.
Among others, she asked officials to prepare an action plan for annual academic year and strive to achieve good results collectively in coordination with students by improving quality of education.
TTD DEO Sri Govindarajan, DFO Sri Srinivasulu Reddy, DE (electrical) Smt Saraswati EEs Sri Manohar, Sri Murali Krishna, polytechnic college principal Smt Asunta, NBA coordinator Smt Padmavati were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టీటీడీ ఎస్‌పిడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్‌బిఏ గుర్తింపునకు కృషి చేయాలి- జెఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి 2022 జూన్ 25: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ పాలిటెక్నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ అఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బిఏ) గుర్తింపునకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిసపాలన భవనంలోని సమావేశ మందిరంలో జెఈవో శనివారం కళాశాలల ప్రిన్సిపాల్‌లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ, ఎన్‌బిఏ బృందం జూలై చివరి వారంలో కళాశాలను సందర్శించనున్న నేపథ్యంలో చేయవలసిన ఇంజినీరింగ్, ఇతర విభాగాల పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కళాశాలలో మౌళిక వసతులను మరింతగా మెరుగుపరచాలన్నారు.
కళాశాలలోని తరగతి గదులు, హాస్టల్ గదులు, ప్రహరి గోడకు పెయింటింగ్, సూచిక బోర్డుల ఏర్పాటు, కళాశాలలో ఐటి తరగతి గదులు, ల్యాబ్‌ల ఆధునీకరణ, పచ్చదనం పెంపొందించడం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
పాఠశాల విద్యను అభివృద్ధి పరచడం కోసం రెగ్యులర్ పాఠశాలలకు మాన్ స్క్రిప్ట్స్ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి విజయలక్ష్మి, ప్రత్యేక ప్రతిభా వంతుల పాఠశాలలకు శ్వేత డెరెక్టర్ శ్రీమతి ప్రశాంతిని ప్రత్యేకాధికారులుగా నియమించినట్లు చెప్పారు. టీటీడీ విద్యాసంస్థల్లో నాణ్యతాప్రమాణాలను మరింత అభివృద్ధి పరచే దిశగా వీరు కృషి చేయాలన్నారు. టీటీడీ విద్యా సంస్థలకు చెందిన ప్రిన్సిపాల్‌లు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక అందచేయాలన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన, నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందించి మరింత ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరు సమిష్టిగా, భాధ్యతాయుతంగా పని చేయాలని జెఈవో సూచించారు.
డిఈవో శ్రీ గోవిందరాజన్, డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాస రెడ్డి, డిఇ (ఎలక్ట్రికల్) శ్రీమతి సరస్వతి
ఇఇలు శ్రీ మనోహర్ శ్రీ మురళీకృష్ణ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి అసుంత, ఎన్ బి ఏ కోఆర్డినేటర్ శ్రీమతి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.