టీటీడీ చైర్మన్ కు డిప్యూటి. సిఎం,మంత్రి కృతజ్ఞతలు

టీటీడీ చైర్మన్ కు డిప్యూటి. సిఎం,మంత్రి కృతజ్ఞతలు

తిరుమల. 28 ఆగస్టు 2020: పుంగనూరు నియోజకవర్గం లోని ఆరు దేవాలయాలు, గంగాధర నెల్లూరు నియోజక వర్గంలోని ఒక ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తెస్తూ జి ఓ జారీ చేయించడం పట్ల డిప్యూటి సిఎం శ్రీ నారాయణ స్వామి, మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఉదయం వారు తిరుమలలో చైర్మన్ ను కలిశారు. దేవాదాయశాఖ పరిధిలోని ఏడు ఆలయాలను టీటీడీ కి అప్పగిస్తూ జారీ అయిన జి ఓ ను శ్రీ సుబ్బారెడ్డి వారికి అందజేశారు. జడ్ పి టీ సి మాజీ సభ్యుడు శ్రీ పోకల అశోక్ కుమార్ వీరి వెంట ఉన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే జారీ చేయడమైనది.