TTD CHAIRMAN SRI RAMANAVAMI GREETINGS _ టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు
Tirumala, 20 April 2021: Describing Sri Rama as Ramo Vigrahavan Dharmah manifestation of all good virtues and qualities, TTD Chairman Sri YV Subba Reddy said Sri Rama has shown humanity to lead a righteous life.
Extending Sri Ramanavami Wishes to all devotees, in his message on Tuesday, the TTD Chairman said everyone should follow the path pioneered by Sri Rama to lead a pious life with ethics.
He said Sri Ramachandra was a role model for people-friendly initiatives of the AP government and sought His blessings for well-being of the people of the state.
The Chairman also appealed to devotees to observe all Covid guidelines during Sri Ramanavami celebrations.
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు
తిరుమల 20 ఏప్రిల్ 2021: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, జనరంజక పాలన అందించిన ధర్మ పరిపాలకుడు శ్రీరాముడని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా మంగళవారం ఆయన ఒక ప్రకటనలో ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీరాముడు చూపిన బాటలో ప్రతి ఒక్కరు ధర్మాచరణ అవలంబించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
శ్రీ రాముడు చూపిన బాటలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాముల వారి ఆశీస్సులు లభించాలని ఆయన ప్రార్థించారు. కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ శ్రీరామ నవమి జరుపుకోవాలని శ్రీ సుబ్బారెడ్డి కోరారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది