టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి కలిసిన భవిష్య
టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి కలిసిన భవిష్య
తిరుపతి, 2021 మార్చి 18: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికైన భవిష్య, కోచ్ కొమ్మినేని గోపినాయుడులు గురువారం టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి, డిఈవో శ్రీ గోవిందరాజులును మర్యాదపూర్వకంగా కలిశారు.
గత నెల కాకినాడలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ పద్నాలుగు ఏళ్ల లోపు ఫెన్సింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి ఈ నెల 24 నుంచి ఒడిస్సా రాష్ట్రం కటక్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఇందులో భాగంగా టీటీడీ జెఈవో, డిఈవోలు భవిష్యను అభినందించి జాతీయ స్థాయి పోటీల్లో పతకం సాధించి టీటీడీ పాఠశాలల ప్రతిష్టను మరింత ఇనుమడించాలని ఆశీర్వదించారు. అలాగే మరికొందరికి కోచింగ్ ఇచ్చి నాణ్యమైన క్రీడాకారులను తయారు చేయాలనీ కోచ్ కు సూచించారు.
భవిష్య తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
జెఈవో, డిఈవోలను కలిసిన వారిలో ఎస్ జీ ఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ చంద్రయ్య, కోచ్ శ్రీ గోపినాయుడు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.