₹. 3.20 CRORE DONATED TO TTD _ టీటీడీ ట్రస్ట్‌లకు రూ.3.20 కోట్లు విరాళం
Tirumala, 12 June 2022: Donations rained on TTD on Sunday from several devotees and institutions to the tune of ₹3.20 crores.
Sri Venkateswarlu, Sri Prasada Rao and Sri Rajamouli of RS Brothers group, Hyderabad have donated ₹1.20 crore to Balaji Arogya Varaprasadini Scheme, ₹1 crore to SV Pranadana trust and ₹60 lakhs to SV Anna Prasadam trust.
Similarly Sri Balachandra, Sri Swapna Kumar of Honour Homes, Hyderabad donated ₹40 lakhs to SV Anna Prasadam trust.
They handed over the DDs for the amount to TTD EO Sri AV Dharma Reddy at the Ranganayakula mandapam inside Srivari temple on Sunday morning.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ ట్రస్ట్‌లకు రూ.3.20 కోట్లు విరాళం
తిరుమల, 2022 జూన్ 12: టీటీడీలోని ట్రస్ట్‌లకు వివిధ సంస్థల నుండి రూ.3.20 కోట్లు ఆదివారం ఉదయం విరాళంగా అందింది.
హైదరాబాదుకు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ గ్రూప్స్ సంస్థ యాజమాన్యం శ్రీ వెంకటేశ్వర్లు
శ్రీ ప్రసాదరావు, శ్రీ రాజమౌళి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.1.20 కోట్లు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు అందించారు.
అదేవిధంగా హైదరాబాదుకు చెందిన హానర్ హోమ్స్ సంస్థ యాజమాన్యం శ్రీ బాలచంద్ర, శ్రీ స్వప్న కుమార్ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.40 లక్షలు విరాళంగా అందించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో
శ్రీ ఎవి.ధర్మారెడ్డికి సంస్థ ప్రతినిధులు సంబంధిత డీడీలను అందజేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.