MEMBERS SWORN IN AS TTD BOARD OF TRUSTEES _ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ తిప్పేస్వామి, డా.కేత‌న్ దేశాయ్‌ ప్రమాణ స్వీకారం

Tirumala, 01 September 2023: Sri Tippeswamy and Dr. Ketan Desai sworn in as members of the TTD Board of Trustees at the Tirumala Srivari Temple on Friday.

JEO(H&E)Smt Sada Bhargavi and Deputy EO Sri. Govindarajan administered oath to Sri Tippeswamy and Dr Ketan Desai respectively in Srivari Temple.

After darshan, Vedic scholars performed Vedasirvachanam in Ranganayakula Mandapam.  Later, the temple authorities presented them with Srivari Tirtha prasadams and portraits of Srivaru.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ తిప్పేస్వామి, డా.కేత‌న్ దేశాయ్‌ ప్రమాణ స్వీకారం

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 01: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ తిప్పేస్వామి, డా.కేత‌న్ దేశాయ్‌ శుక్ర‌వారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో శ్రీ తిప్పేస్వామి చేత జెఈవో శ్రీమతి సదా భార్గవి, డా.కేత‌న్ దేశాయ్‌ చేత డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్ ప్రమాణ స్వీకారం చేయించారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం వీరికి ఆల‌య అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.