CHATURVEDA HAVANAM FOR THE WELL-BEING OF HUMANITY _ దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చతుర్వేద హవనం : టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

TIRUPATI, 05 JULY 2023: The maiden Srinivasa Chaturveda Havanam is organised in TTD Parade Grounds for a week seeking the divine intervention for the well-being of humanity said TTD EO Sri AV Dharma Reddy.

After the completion of the sacred Homam with Maha Purnahuti on Wednesday, talking to media persons the EO said, 32 Rutwiks performed the Homam with utmost devotion every day while in the evening religious discourses with eminent vedic scholars were arranged followed by devotional cultural programmes which allured the denizens, he added.

He thanked all the Acharya Purushas and especially veteran scholar Sri Chirravuri Sri Rama Sharma under whose supervision the entire religious event took place.

TTD JEO for Health and Education Smt Sada Bhargavi said more such Havans will be organised for the welfare of the people in future by TTD.

Eminent Vedic Pundit Sri Rama Sharma said the Mantras from all Five Vedic departments have been recited and the deities were appeased to safeguard the people from all bad effects.

Later the devotees were issued Prasadam.

CEO SVBC Sri Shanmukh Kumar, HDPP Secretary Sri Srinivasulu, SVETA Director and Program Incharge Smt Prasanthi, Estates Special Officer Sri Mallikharjuna, Manuscripts Project Special Officer Smt Vijaya Lakshmi, SVIHVS Special Officer Dr Vibhishnana Sharma and other employees were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చతుర్వేద హవనం : టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

– మహాపూర్ణాహుతితో ముగిసిన చతుర్వేద హవనం

తిరుపతి, 2023, జూలై 05: దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో తొలిసారిగా చతుర్వేద హవనం నిర్వహించామని టీటీడీ ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. ఏడు రోజులపాటు జరిగిన చతుర్వేద హవనం బుధవారం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈవో మీడియాతో మాట్లాడుతూ లోకకల్యాణం కోసం నిర్వహించిన ఈ హవనంలో 32 మంది రుత్వికులు ప్రతిరోజూ ఉదయం నాలుగు వేదాలను పారాయణం చేశారని చెప్పారు. సాయంత్రం వేళ ప్రముఖ పండితులతో ధార్మిక ప్రవచనాలు, ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో చక్కటి సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. తిరుపతి వాసులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు. చతుర్వేద హవనాన్ని చక్కగా నిర్వహించిన అధికారులకు, పండితులకు, రుత్వికులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో చతుర్వేద హవనాన్ని తిరుపతిలో నిర్వహించినట్లు చెప్పారు. టీటీడీ ఉద్యోగులు, నగరవాసులతోపాటు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ హవనాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి హవనాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

చతుర్వేద హవనం మార్గదర్శకులు శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వస్తి, శ్రద్ధ, మేధ, కీర్తి, ప్రజ్ఞాశక్తి అందించేందుకు హవనం నిర్వహించినట్లు చెప్పారు. ఐదు శాఖల్లోని వేదమంత్రాలతో దేవతల అనుగ్రహం కోసం హోమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఇలాంటి హవనాల వల్ల సకల లోకకళ్యాణం సిద్ధిస్తుందన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు, ఇన్ఛార్జి ప్రోగ్రామింగ్ అధికారి శ్రీమతి ప్రశాంతి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.