TTD EO UNVEILS SPECIAL MOBILE APP FOR TTD PENSIONERS _ టీటీడీ పెన్ష‌న‌ర్ల కోసం మొబైల్ యాప్‌ – ఆవిష్క‌రించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirupati, 18 August 2023: In order to provide effective service to TTD pensioners, TTD EO Sri AV Dharma Reddy on Friday launched a  TTD Pensioner Mobile App.

 

The launch program was held at EO chambers in the TTD Administrative building. The app facilitates 8,120 pensioners with pay slips,  personal data, life certificate, pension benefits and family details. 

 

The app is conceived by TTD accounts and IT departments. The app can be downloaded in any Android phone and soon will be made available in the Google app store.

 

TTD FACAO Sri O Balaji, IT GM Sri Sandeep, Additional FA&CAO Sri Raviprasadu were also present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ పెన్ష‌న‌ర్ల కోసం మొబైల్ యాప్‌ – ఆవిష్క‌రించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుపతి, 2023 ఆగస్టు 18: పెన్ష‌న‌ర్ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేందుకు TTD Pensoner Mobile App పేరుతో రూపొందించిన మొబైల్ యాప్‌ను శుక్ర‌వారం టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

టీటీడీలో 8,120 మంది పెన్ష‌న‌ర్లు ఉన్నారు. పేస్లిప్పులు, వ్య‌క్తిగ‌త వివ‌రాలు, జీవ‌న్‌ప్ర‌మాణ్ (లైవ్ స‌ర్టిఫికేట్ వివ‌రాలు), పెన్ష‌న్ బెనిఫిట్లు, కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. త్వ‌ర‌లో యాప్‌స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తారు. టీటీడీ ఐటి విభాగం, అకౌంట్స్ విభాగం సంయుక్త‌ ఆధ్వ‌ర్యంలో సిజిజి స‌ర్వీసెస్ వారు ఈ యాప్‌ను రూప‌క‌ల్ప‌న చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, ఐటి జిఎం శ్రీ ఎల్ఎం.సందీప్‌, అద‌న‌పు ఎఫ్ఏసిఏవో శ్రీ ర‌విప్ర‌సాదు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.