JEO INSPECTS TTD REST HOUSES _ టీటీడీ విశ్రాంతి గృహాల్లో జెఈవో ఆకస్మిక తనిఖీలు
Tirupati, 9 Mar. 21: TTD JEO Smt Sada Bhargavi made a surprise inspection to TTD rest houses including SV rest house, Srinivasam, Vishnu Nivasam, 2&3 Choultries in Tirupati on Tuesday.
She directed officials to organise proper parking at SV rest house. At Vishnu Nivasam she interacted with pilgrims about services and later visited the Srivari Seva office where she instructed that not more than 40 devotees should be accommodated in each hall as per Covid-19 guidelines.
She advised officials to remove unused and damaged furniture to storerooms, provide pure drinking water to devotees on a 24×7 basis, and take up civil and electrical repairs regularly.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీ విశ్రాంతి గృహాల్లో జెఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుపతి 9 మార్చి 2021: తిరుపతిలోని ఎస్వీ విశ్రాంతి గృహం, విష్ణునివాసం, రెండు, మూడు సత్రాలను జెఈవో శ్రీమతి సదా భార్గవి మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఎస్వీ విశ్రాంతి గృహం, సత్రాల్లో వాహనాల పార్కింగ్ క్రమ పద్ధతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జెఈవో శ్రీమతి సదా భార్గవి విష్ణు నివాసంలో యాత్రికులతో మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సేవల పట్ల యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం విష్ణు నివాసంలోని శ్రీవారి సేవ కార్యాలయాన్ని పరిశీలించారు. కోవిడ్ 19 నిబంధనల మేరకు శ్రీవారి సేవకులకు ఒక హాల్లో 40 మందికి మించి వసతి కల్పించవద్దని అధికారులకు సూచించారు. ఉపయోగించని, పాడైన ఫర్నీచర్, ఇతర సామగ్రి ని స్టోర్ కు తరలించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జెఈవో అధికారులను ఆదేశించారు. యాత్రికులకు 24 గంటలూ శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సివిల్, ఎలక్ట్రికల్ మరమ్మతు పనులు చేయించాలని చెప్పారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది