ALL TTD TEMPLE INFO ON TTD WEBSITE-JEO _ టీటీడీ వెబ్సైట్లో ఆలయాల సమాచారం – జేఈవో శ్రీ వీరబ్రహ్మం
TIRUPATI, 08 JULY 2023: TTD JEO Sri Veerabrahmam on Saturday directed officials to upload information about activities of all TTD temples on its official website.
Addressing DyEOs and other officials of all TTD temples at Tirupati and other places through a virtual review conference on Saturday, the TTD JEO said the PRO and IT departments should coordinate with all other departments to update and upload information on development activities and devotees-oriented information about Sevas, temple timings etc. on the TTD website.
Among others he instructed officials to install signage boards in several languages at all locations about temple legend, distance, Sevas, temple timings and facilities available for devotees etc.
The departments should coordinate with SVBC and produce promo jingles on the puranic significance of TTD temples, festivals etc. at Kurukshetra, Rishikesh, Jammu, Kanyakumari, Bhuvaneswar SV temples, coordinate with tourism departments of each state to push up footfalls and organise special bus facilities etc.
DyEOs Sri Govindarajan, Sri Vijay Kumar, Smt Varalakshmi, Smt Shanti, Sri Devendra Babu, Sri Ramesh Babu, Estate officer Sri Lakshmana Murthy participated in the virtual conference.
టీటీడీ వెబ్సైట్లో ఆలయాల సమాచారం – జేఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి 8 జూలై 2023: టీటీడీ వెబ్సైట్లో స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాల సమాచారం అప్లోడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని జేఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆలయాల డెప్యూటీ ఈవోలు ఇతర అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయాల సందర్శనకు వచ్చే భక్తుల సౌలభ్యం కోసం ఆయా ఆలయాల స్థల పురాణం, దూరం, వీటికి సంబంధించిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆలయాల విశిష్టతపై వివిధ బాషల్లో సంక్షిప్త సమాచారం పొందుపరచాలన్నారు. ఇందుకోసం ఐటీ, పిఆర్వో విభాగాలతో సమన్వయం చేసుకుని త్వరలో వెబ్సైట్లో ఆలయాల సమాచారం, సేవలు, దర్శన వేళలు ఆలయాల్లో భక్తులకు ఉన్న సదుపాయాలు తదితర విషయాలన్నీ పొందుపరచాలని శ్రీ వీరబ్రహ్మం సూచించారు.
ఎస్వీ బీసీతో సమన్వయం చేసుకుని ఆలయాల సమాచారానికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆలయంలో ఉభయ దారులను ప్రోత్సహించేలా చూడాలన్నారు. భక్తుల కనీస అవసరాలైన తాగునీరు, మరుగుదొడ్లు చక్కగా నిర్వహించాలన్నారు. నగరి, నారాయణవనం, బుగ్గ ఆలయాల కు టూరిజం బస్సులు వచ్చేలా ఆయా అధికారులతో చర్చించాలని ఆయన చెప్పారు. రిషికేష్, కురుక్షేత్ర, కన్యాకుమారి ఆలయాల అధికారులు కూడా ఆయా రాష్ట్రాల టూరిజం అధికారులతో మాట్లాడి ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసి యాత్రికుల బస్సులు ఆలయానికి వచ్చేలా చూడాలన్నారు. కొత్తగా నిర్మించిన రంపచోడవరం, సీతంపేట, జమ్ములాంటి ఆలయాల్లో భక్తుల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
డెప్యూటీ ఈవో లు శ్రీ గోవిందరాజన్, శ్రీమతి ఝాన్సీ, శ్రీమతి వరలక్ష్మి, శ్రీ విజయకుమార్, శ్రీ దేవేంద్రబాబు, శ్రీ రమేష్ బాబు, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ లక్ష్మణ్ మూర్తి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది