KARTHIKA DEEPOTSAVAM OBSERVED IN ALL LOCAL TEMPLES OF TTD _ టీటీడీ స్థానిక ఆలయాల్లో ఘనంగా కార్తీక దీపోత్సవం
TIRUPATI, 15 DECEMBER 2024: The auspicious Karthika Deepotsavam was observed with utmost religious fervour in all TTD local temples on Sunday evening.
At Sri Govindaraja Swamy, Sri Kodanda Ramalayam, Srinivasa Mangapuram, Narayanavanam temples the entire temple premises were lit with ghee lamps in a traditional manner.
The concerned temple officials, archakas were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ స్థానిక ఆలయాల్లో ఘనంగా కార్తీక దీపోత్సవం
తిరుపతి, 2024 డిసెంబరు 15: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆదివారం కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి కార్తీక దీపం, వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించారు.
శ్రీ కోదండరామాలయంలో
తిరుపతి శ్రీ కోదండరామాలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకొచ్చారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.