TTD CHAIRMAN RELEASES CALENDARS OF LOCAL TEMPLES _ టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్
టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్
తిరుమల, 2024 నవంబరు 18: టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్లను టీటీడీ ఛైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామల రావుతో కలిసి ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ బోర్డు మీటింగ్ అనంతరం ఈ కార్యక్రమం జరిగింది.
టీటీడీ స్థానిక ఆలయాలైన తిరుమలలోని శ్రీ భూ వరాహ స్వామి, తిరుపతి సమీపంలోని పేరూరు శ్రీ వకుళమాత ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామి, కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి మూలమూర్తులు, ఉత్సవమూర్తులతో కూడిన క్యాలెండర్లను టీటీడీ అత్యద్భుతంగా రూపొందించి ముద్రించింది. ఈ క్యాలెండర్లు బుధవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.