ADDL.EO BRIEFS TRAINEE IAS ON TTD ACTIVITIES _ ట్రైనీ ఐఏఎస్‌లకు టిటిడి కార్యకలాపాలపై అవగాహన
Tirumala, 27 January 2020: TTD Additional Executive Officer Sri AV Dharma Reddy briefed trainee IAS officers on various TTD activities which included Dharmic programmes, Welfare Schemes and other pilgrim initiatives.
Making a power point presentation at the Gokulam Rest House in Tirumala, he highlighted the focus of TTD on transparency, Information Technology for services like time slot darshan, laddu Prasadam, accommodation, e-office towards paperless administration, clean and green Tirumala and Srivari Seva etc.
He also briefed them on TTDs administrative set up, functions of officers and staff, TTDs Trusts and promotion of Vedic culture, education, medical services etc.
DyEO of Srivari Temple Sri Harindranath, DEO and liaison officer Dr Ramana Prasad, SETWIN CEO and Government liaison officer Sri Muralikrishna, Catering Officer Sri Shastry, Reception DyEO Sri Balaji, Kalyana Katta DyEO Sri Selvam, VSO Sri Manohar and others participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ట్రైనీ ఐఏఎస్‌లకు టిటిడి కార్యకలాపాలపై అవగాహన
తిరుమల, 2020 జనవరి 27: టిటిడి కార్యకలాపాలపై 19 మంది శిక్షణ ఐఏఎస్‌లకు టిటిడి అదనుపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో అవగాహన కల్పించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో గల సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.
టిటిడి అమలుచేస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలు, వైద్య శాలలు, విద్యాసంస్థల గురించి వివరించారు. టెక్నాలజీ సాయంతో పారదర్శకంగా భక్తులకు అందిస్తున్న సేవలు, లడ్డూ ప్రసాదాల పంపిణీ, వసతి, దివ్యదర్శనం, సర్వదర్శనం, టైంస్లాట్, ఆన్‌లైన్ సేవలు, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవ కార్యకలాపాలను తెలిపారు. అదేవిధంగా టిటిడిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టిటిడిలో పరిపాలన క్రమశ్రేణి, అధికారుల బాధ్యతలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను వారికి తెలియజేశారు. టిటిడి నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులు, వేద విద్యవ్యాప్తికి తీసుకుంటున్న చర్యలు వివరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, డిఈవో మరియు లైజన్ అధికారి డా.రమణప్రసాద్, సెట్విన్ సిఈవో మరియు ప్రభుత్వ లైజన్ అధికారి శ్రీ మురళికృష్ణ, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి, రిసెప్షన్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజీ, కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీ సెల్వం, విఎస్‌వో శ్రీ మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
——————————
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.