డిసెంబరు 11న తిరుచానూరులో వన మహోత్సవం
డిసెంబరు 11న తిరుచానూరులో వన మహోత్సవం
డిసెంబరు 10, తిరుపతి, 2019: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబరు 11వ తేదీ బుధవారం వన మహోత్సవం ఘనంగా జరుగనుంది. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 23 నుండి డిసెంబరు వ1వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతమైనందుకు గాను వన మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఆలయం వద్దగల శుక్రవారపుతోటలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తరువాత మహా నివేదన, వనమహోత్సవంలో భాగంగా ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో సేవలందించిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.