KARTIKA DEEPOTSAVAM AT TTD LOCAL TEMPLES ON DECEMBER 15 _ డిసెంబ‌రు 15న టీటీడీ స్థానిక‌ ఆలయంలో కార్తీక దీపోత్సవం

Tirupati, 13 December 2024: The annual Kartika Deepotsavam will be celebrated on December 15 at  Sri Govindaraja Swamy Temple and in Sri Kodanda Ramalayam in Tirupati.

In the evening, Karthika lamp and clothes are taken in a procession from Sri Pundarikavalli Ammavari Temple to Sri Govindaraja Swamy.  On this occasion, the Kartika lamp will be lit in the temple and sub-shrines.

At Sri Kodandaramalayam the Kartika Deepotsavam will be celebrated in the evening.

As part of this the Kartika Deepam from Sri Govindaraja Swamy temple was brought in a procession to Sri Kodandaramalaya and the Kartika Deepams are lit.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబ‌రు 15న టీటీడీ స్థానిక‌ ఆలయంలో కార్తీక దీపోత్సవం

తిరుపతి, 2024 డిసెంబరు 13: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 15న‌ కార్తీక దీపోత్సవం ఘ‌నంగా జరుగ‌నుంది. సాయంత్రం శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి కార్తీక దీపం, వ‌స్త్రాల‌ను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి సమర్పిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించ‌నున్నారు.

శ్రీ కోదండరామాలయంలో

తిరుప‌తి శ్రీ కోదండరామాలయంలో డిసెంబ‌రు 15న‌ సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకువ‌చ్చి, కార్తీక దీపాలు వెలిగిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.