TIRUPPAVAI DISCOURSES FROM DECEMBER 16 TO JANUARY 14 _ డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు

• TIRUPPAVAI DISCOURSES AT 233 CENTRES ACROSS THE COUNTRY, INCLUDING TIRUPATI

Tirupati, 08 December 2025: In view of the sacred Dhanurmasa, Tiruppavai discourses will be held from December 16, 2025, to January 14, 2026, at 233 centres across India by eminent scholars. These programmes are being organised under the auspices of the TTD Alwar Divya Prabandha Project.

As part of this initiative, discourses will be conducted at the following locations:

Andhra Pradesh – 76 centres

Telangana – 57 centres

Tamil Nadu – 73 centres

Karnataka – 21 centres

Puducherry – 4 centres

New Delhi – 1 centre

Odisha – 1 centre

During the Dhanurmasa period, Tiruppavai will be recited in place of Suprabhatam at the Tirumala Sri Venkateswara Temple. In Tirupati, Tiruppavai discourses and recitations will be held at the Annamacharya Kalamandiram and the Sri Varadaraja Swamy Temple on KT Road.

Sri Godadevi, one among 12 Alwars, composed the Tiruppavai—a set of 30 pasurams—explaining the method of performing this Dhanurmasa vratham. The essence of Tiruppavai is rendering service (kainkaryam) to the Supreme Lord. 

Scholars say that the vratham yields greater results when performed collectively rather than individually. In accordance with this tradition, Tiruppavai Sattumurai is conducted in all Vaishnava temples across the country during this auspicious month.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
 

డిసెంబరు 16 నుంచి జనవరి 14 తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు

  తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాలలో  తిరుప్పావై

తిరుమల, 2025 డిసెంబ‌రు 08: పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.  టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఆంధ్రప్ర‌దేశ్ -76, తెలంగాణ -57, త‌మిళ‌నాడు– 73, క‌ర్ణాట‌క‌– 21, పాండిచ్చేరి– 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒకొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వ‌హించ‌నున్నారు

తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు.

12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది.

ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు . ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.