డిసెంబరు 16 నుండి 19వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు
డిసెంబరు 16 నుండి 19వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి, 2023 డిసెంబరు 05: శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా టీటీడీ శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 16 నుండి 19వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
– డిసెంబరు 16న పాలకొల్లు మండల కేంద్రంలోని పెనుమాడం రోడ్డులో గల ఆర్ఆర్ రైస్‌మిల్ మైదానంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– డిసెంబరు 17న యలమంచిలి మండలం కట్టుపాళెం గ్రామంలోని శ్రీ కోదండరామాలయం పక్కన గల ఖాళీ స్థలంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు.
– డిసెంబరు 18న తణుకు మండలం దువ్వ గ్రామంలోని శశి సెకండరీ పాఠశాల మైదానంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.
– డిసెంబరు 19న తాడేపల్లిగూడెం మండలంలోని పడాల మార్కెట్ యార్డులో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.