TIRUPPAVAI PRAVACHANAMS ACROSS COUNTRY _ డిసెంబరు 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు

DHANUR MASA PROGRAM FROM DECEMBER 17- JANUARY 14

 

Tirumala, 06 December 2023: As a part of holy Dhanurmasa Dharmic programs,  TTD is organising  Tiruppavai Pravachanams at Tirupati and in all 216 centres across the country from December 17- January 14, under the aegis of the Alwar Divya Prabandha project.

 

The special feature of the Dhanur masa program is that in the place of Suprabhatam, Tiruppavai is being observed in all Sri Vaishnava temples during that one month.

 

In Tirupati, Tiruppavai will be recited at Annamacharya Kalamandiram.

 

Andal Sri Goda Devi, one among the 12 Alwars, had observed Dhanurmasa Vratam for the prosperity, and health of humanity. She penned 30 Pasuras in Tiruppavai Divya Prabandham about the vratam procedure.

 

The 10th skanda of Bhagavatam indicates that Gopikas performed the Vratam seeking Sri Krishna’s blessings.

 

The tradition is in practice at all Sri Vaishnava temples where Tiruppavai Sattumora is held annually during the holy Dhanur masam.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబరు 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు

– తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 216 కేంద్రాలు

తిరుప‌తి, 06 డిసెంబ‌రు 2023: పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 216 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంతోపాటు ఏడు ప్రాంతాల్లో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు.

12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది.

ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.