KOIL ALWAR TIRUMANJANAM ON DECEMBER 19 _ డిసెంబరు 19న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala, 06 December 2023: Ahead of auspicious Vaikunta Ekadasi festival from December 24 followed by Vaikunthadwara Darshan till 2024 January 1, TTD is organising Koil Alwar Tirumanjanam, traditional temple cleansing fete at Srivari temple on December 19.
Traditionally the Koil Alwar Tirumanjanam is observed four times a year – on the Tuesdays ahead of Ugadi, Anivara Asthanam, annual Brahmotsavams and Vaikunta Ekadasi.
TTD has cancelled the Astadala Pada Padmaradhana Seva on the day.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డిసెంబరు 19న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల, 2023 డిసెంబరు 06: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీ మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
డిసెంబరు 19న ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక8 పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
ఈ కారణంగా ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.