డిసెంబరు 23 నుండి 25వ తేదీ వరకు వార్షిక గీతా జయంతి ఉత్సవాలు
డిసెంబరు 23 నుండి 25వ తేదీ వరకు వార్షిక గీతా జయంతి ఉత్సవాలు
తిరుపతి, 2020 డిసెంబరు 22: టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 23 నుండి 25వ తేదీ వరకు వార్షిక గీతాజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా 6 నుండి 10 వ తరగతి వరకు గల విద్యార్ధినీ విద్యార్థులకు డిసెంబరు 23వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీమద్భగవద్గీత నందలి ద్వాదశోధ్యాయం భక్తియోగం మీద కంఠస్థ పోటీలు నిర్వహిస్తారు. డిసెంబరు 24న ప్రముఖ పండితులతో గీతాసందేశంపై చర్చాగోష్టి, డిసెంబరు 25న విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు.
కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూనే విద్యార్థినీ విద్యార్థులు పోటీలలో పాల్గొనవలసి ఉంటుంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.