KOIL ALWAR TIRUMANJANAM AT SRI GT ON DEC 25 _ డిసెంబ‌రు 25న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 20 December 2025: Koil Alwar Tirumanjanam will be observed at the Sri Govindaraja Swamy temple in Tirupati on December 25. 

This ritual is traditionally performed in connection with the upcoming Vaikuntha Ekadasi festival scheduled on December 30.

The Koil Alwar Tirumanjanam will take place from 7a.m. to 9a.m.

During this sacred purification ritual, the temple premises including the sanctum, walls, roof, and all ritual articles will be cleansed with water. 

Subsequently, holy water mixed with aromatic ingredients will be sprinkled throughout the temple. After the completion of the sacred cleaning activity, the devotees will be allowed for Sarva darshan from 9:30 a.m. onwards.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

డిసెంబ‌రు 25 శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2025 డిసెంబరు 20: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 25వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో డిసెంబ‌రు 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా డిసెంబ‌రు 25వ తేదీ తెల్లవారుజామున తిరుప్పావై స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.