KOIL ALWAR TIRUMANJANAM AT SRIVARI TEMPLE ON DECEMBER 23 _ డిసెంబర్ 23న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
CANCELLATION OF VIP BREAK DARSHANS EXCEPT FOR PROTOCOL VIPS
LETTERS OF RECOMMENDATION WILL NOT BE ACCEPTED ON DECEMBER 22
Tirumala, 19 December 2025: The Koil Alwar Tirumanjanam in connection with Vaikuntha Dwara Darshanam will be held on December 23.
It is customary to conduct Koil Alwar Tirumanjanam four times a year on the Tuesday before Ugadi, Anivara Asthanam, Brahmotsavam and Vaikuntha Ekadashi festivals.
On December 23 from 6 am to 10 am, the priests will perform the temple purification program. Due to this, Astadala Pada Padmaradhana Seva was cancelled.
Similarly on the December 23 VIP break darshans are canceled except for protocol dignitaries and letters of recommendation will not be accepted on December 22.
The devotees are requested to make note of these changes and cooperate with TTD.
డిసెంబర్ 23న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
22న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు
తిరుమల, 2025 డిసెంబర్ 19: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని డిసెంబర్ 23వ తేది మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
డిసెంబర్ 23వ తేది ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేయడం జరిగింది.
అదేవిధంగా 23న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో 22వ తేది సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
