TTD EYES ON ECO-FRIENDLY PRODUCTS OUT OF “DRY FLOWER TECHNOLOGY” _ డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జితో అక‌ర్ష‌ణీయ ఉత్ప‌త్తులు – టిటిడి ఈవో

TIRUPATI, 18 AUGUST 2021: As part of its continued eco-friendly efforts, TTD is keen on introducing Dry Flower Technology to produce decorative products and ornamental materials required for its needs.

A meeting was held on the same by TTD EO Dr KS Jawahar Reddy on Wednesday at his chambers in TTD Administrative Building in Tirupati along with JEO Smt Sada Bhargavi and VC of Dr YSR Horticultural University, West Godavari Dr Janakiram, its Director of Extension Dr Srinivas and VC of SV Veterinary University, Tirupati Dr Padmanabha Reddy.

The EO said, “Dry Flower Technology which is a form of artistic expression that was very popular during the Victorian period and has once again gained popularity. As the products out of this technology are globally accepted as natural, eco-friendly, long lasting and inexpensive, we wanted to make use of the technology in designing bouquets, paperweights, laminated photos etc. If the Horticultural University comes forward to share its expertise in making the products, we are ready to allocate land in Tirupati to set up a Centre with required machinery, research station and other infrastructure for initial five years and later you can hand over the Centre to TTD”, the EO said.

The VC of Dr YSR Horticultural University, Dr Janakiram said, “Already Tea out of Marigold, Hibiscus, Lillies, Roses, Lemon Grass, soaps, body care products, facial creams, masks, spray etc. Are being prepared and marketed by the University locally. “We are also giving special training exclusively in preparing these products in our Varsity”, he maintained.

CE Sri Nageswara Rao, Garden Deputy Director Sri Srinivasulu, DFO Sri Chandrasekhar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జితో అక‌ర్ష‌ణీయ ఉత్ప‌త్తులు – టిటిడి ఈవో

తిరుమ‌ల‌, 2021 ఆగస్టు 18: డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి ద్వారా టిటిడి అవ‌స‌రాల‌కు త‌గిన ఉత్ప‌త్తులు త‌యారు చేసి ఇవ్వ‌డానికి ముందుకు రావాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను కోరారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని త‌న ఛాంబ‌ర్‌లో బుధ‌వారం ఈవో డాక్ట‌ర్ వై.ఎస్‌.ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డాక్ట‌ర్ జాన‌కిరామ్, ప‌శువైద్య విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డాక్ట‌ర్ ప‌ద్మానాభ‌రెడ్డి, ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం డైరెక్ట‌ర్ అఫ్ ఎక్స్‌టెన్ష‌న్ డాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌తో స‌మావేశమ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి ద్వారా బొకేలు, ల్యామినేటెడ్ ఫోటోలు, పేప‌ర్ వెయిట్స్ త‌దిత‌ర ఉత్ప‌త్తుల త‌యారీలో నైపుణ్యం ఉన్నడాక్ట‌ర్ వై.ఎస్‌.ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ముందుకు వ‌స్తే తిరుప‌తిలో స్థ‌లం కేటాయిస్తామ‌ని చెప్పారు. ఇందులో ఉత్ప‌త్తుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే యంత్రాలు, సౌక‌ర్యాలతో పాటు, ప‌రిశోధ‌న కేంద్రం ఏర్పాటు చేసుకోవ‌చ్చున‌ని సూచించారు. ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఈ కేంద్రాన్ని నిర్వ‌హించుకుని త‌రువాత టిటిడికి అప్ప‌గించే ప్ర‌తిపాద‌న ప‌రిశీలించాల‌న్నారు.

డాక్ట‌ర్ వై.ఎస్‌.ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డాక్ట‌ర్ జాన‌కిరామ్ మాట్లాడుతూ త‌మ విశ్వ‌విద్యాల‌యం డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి ద్వారా ఇప్ప‌టికే రోజ్‌టీ, లిల్లీ టీ, లెమ‌న్ గ్రాస్‌ మ్యారిగోల్డ్ టీ, హైబిస్క‌స్ టీ, సోపులు, బాడీ కెర్ ఉత్ప‌త్తులు, ఫేషియ‌ల్ క్రీములు, మాస్క్‌లు, స్ప్రే లాంటి అనేక ఉత్ప‌త్తులు స్థానికంగానే త‌యారు చేస్తున్నామ‌ని చెప్పారు. ఇందుకోసం సిబ్బందికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తున్నామ‌న్నారు.

ఈ స‌మావేశంలో జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, గార్డెన్ సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీ‌నివాస్‌, డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.