BHOOMI PUJA PERFORMED FOR PHASE – I RENOVATION WORKS AT TALAKONA SRI SIDDESWARA SWAMY TEMPLE _ తనకోన శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం మొదటి దశపునర్మిణాన పనులకు భూమి పూజ

Tirupati, 18 August 2025: The Bhoomi Puja for the first phase of renovation works at the historic Sri Siddeswara Swamy Temple, Talakona, Tirupati District was performed on Monday, in a traditional manner.

Speaking on the occasion, TTD Chairman Sri B.R. Naidu said that, under the instructions of Hon’ble Chief Minister of AP Sri N. Chandrababu Naidu, the government and TTD are expediting the construction and renovation of ancient temples as part of the promotion of Sanatana Dharma.

The first phase of works will cover the historical Sri Siddeswara Swamy Garbhalayam (Sanctum Sanctorum), Ardha Mandapam, Sri Parvati Devi Garbhalayam, Maha Mandapam.

He said TTD has already sanctioned ₹2 crores for these works, which have also been approved by the State Government. 

The Chairman further added that additional financial support will be provided in a phased manner for these works as well as for other developmental activities.

In subsequent phases, TTD will take up Mukha Mandapam, Nandi Mandapam, Raja Gopuram, Sri Subramanyeswara Swamy Temple, Sri Vinayaka Swamy Temple, Navagraha Mandapam, Sri Abhaya Anjaneya Swamy Temple, Dhwaja Mandapam, office rooms, storerooms, Potu, Kalyana Katta, Pushkarini and other facilities, he added.

Earlier in the morning, special pujas were performed as part of the Bhoomi Puja rituals.

The program was attended by Chandragiri MLA Sri Pulivarthi Nani, District Collector Dr. Venkateshwar, TTD Board Member Sri Shanta Ram, TTD CE Sri  Satyanarayana, TTD SE Sri Manoharam, EE Sri Jaganmohan Reddy, officials from the Endowments Engineering Department and several devotees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తనకోన శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం మొదటి దశ పునర్మిణాన పనులకు భూమి పూజ

దశల వారీగా ఆలయ పనులకు నిధులు విడుదల  టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు

తిరుపతి, 2025, ఆగష్టు 18: తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో మొదటి దశ పునర్మిణాన పనులకు ఆగష్టు 18వ తేదీ సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.  ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాల నిర్మాణం, పునర్మిణాం పనులను వేగవంతం చేస్తున్నట్లు టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు.

మొదటి దశగా శ్రీ సిద్దేశ్వర స్వామి వారి గర్భాలయం, అర్ధమండపం, శ్రీ పార్వతీదేవి అమ్మవారి గర్భాలయం, మహా మండపం పనులను పునర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు టిటిడి ఛైర్మెన్ వెల్లడించారు. ఈ పనుల కోసం మొదటి దశగా ఇప్పటికే రూ. 2 కోట్లు టిటిడి విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ నిధులతో పాటు సదరు పనులకు, ఇతర అభివృద్ధి పనులకు దశల వారీగా మరిన్ని నిధుల సహకారం అందిస్తామన్నారు.

వీటితోపాటు ముఖ మండపం, నంది మండపం, రాజ గోపురం, శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం, శ్రీ వినాయక స్వామి ఆలయం, నవగ్రహ మండపం, శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ధ్వజమండపం, ఆఫీస్ గదులు, స్టోర్ గదులు, పోటు, కళ్యాణకట్ట, పుష్కరిణి తదితర పనులను చేపట్టనున్నారు.    

అంతకుముందు భూమి పూజకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, టిటిడి సీఈ శ్రీ టి.వి సత్యనారాయణ, టిటిడి ఎస్ ఈ శ్రీ మనోహర్, ఈఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది