ANNAMAYYA SANKEERTANAS – A TIMELESS LITERARY TREASURE: ACHARYA ANJANEYULU _ తరతరాలకు స్ఫూర్తినిచ్చే అన్నమయ్య సంకీర్తనల సాహిత్య సంపద : ఆచార్య ఆంజనేయులు
Tirupati, May 03, 2026: The sankeertanas of Sri Tallapaka Annamacharya are a rare literary treasure blending devotion, philosophy, and human values, inspiring generations, said Acharya Anjaneyulu from Hyderabad. The literary seminars as part of Annamayya’s 618th Jayanthi celebrations began grandly on Sunday at Annamacharya Kalamandiram in Tirupati.
Presiding over the session, he spoke on “The Uniqueness of Annamayya in Ancient Telugu Literature” and described Annamacharya as the first vaggeyakara. He said his compositions serve as divine guides that deepen devotion.
Dr. Anantha Padmanabha Rao noted that TTD’s Annamacharya Project is effectively promoting these sankeertanas. He added that radio, television, and digital platforms are helping spread them globally.
Acharya Damodara Naidu explained the unique diction of Tallapaka poets, while Acharya Chennappa highlighted the themes of equality and humanism in Annamayya’s compositions.
Dr. Medasani Mohan, Special Officer of Annamacharya Project, Director Smt. Latha, and others participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తరతరాలకు స్ఫూర్తినిచ్చే అన్నమయ్య సంకీర్తనల సాహిత్య సంపద : ఆచార్య ఆంజనేయులు
తిరుపతి, 2026 మే 03: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనలు భక్తి, తాత్వికత, మానవీయ విలువల సమ్మేళనంగా తరతరాలకు స్ఫూర్తినిచ్చే అపూర్వ సాహిత్య సంపదగా నిలిచాయని హైదరాబాద్ కు చెందిన ఆచార్య ఆంజనేయులు తెలిపారు. అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సాహితీ సదస్సులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
సదస్సుకు అధ్యక్షత వహించిన ఆయన “ప్రాచీనాంధ్ర సాహిత్యంలో అన్నమయ్య ప్రత్యేకత” అంశంపై మాట్లాడుతూ, తాళ్లపాక అన్నమాచార్యులను తొలి వాగ్గేయకారుడిగా అభివర్ణించారు. ఆయన సంకీర్తనలు భక్తిని గాఢం చేసే దివ్య మార్గదర్శకాలుగా నిలిచాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ కు చెందిన డా. అనంత పద్మనాభ రావు “అన్నమయ్య సంకీర్తనల ప్రచారం–ప్రసారం”పై మాట్లాడుతూ, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ద్వారా సంకీర్తనల ప్రచారం సమర్థవంతంగా కొనసాగుతోందన్నారు. రేడియో, టీవీ, డిజిటల్ వేదికల ద్వారా ఈ కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు.
తిరుపతికి చెందిన ఆచార్య దామోదర నాయుడు తాళ్లపాక కవుల పదప్రయోగాల వైశిష్ట్యాన్ని వివరించగా, ఆచార్య చెన్నప్ప అన్నమయ్య కీర్తనల్లో సమానత్వం, మానవత్వం ప్రతిఫలిస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్, సంచాలకులు శ్రీమతి లత తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది






