MATRUSRI TARIGONDA VENGAMAMBA A NATURAL POETESS, SAYS ACHARYA KG KRISHNAMURTHY _ తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం

సహజ కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ : ఆచార్య కెజి.కృష్ణమూర్తి

తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2021 ఆగస్టు 15: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సామాన్యులు సైతం అర్థం చేసుకునే ప్రజాకవిత్వం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని ప్రముఖ పండితులు ఆచార్య కెజి.కృష్ణమూర్తి తెలిపారు. శ్రీవారి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతి ఉత్సవాలు ఆదివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో
ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. టిటిడి తరిగొండ వెంగ‌మాంబ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో రెండు రోజుల పాటు ఈ ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌తో ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు జరిగింది. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఉపన్యసిస్తూ వెంగమాంబ తన జీవితాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేశారని తెలిపారు. ఈమె వ్యక్తిగా, సంస్కర్తగా, యోగినిగా, కవయిత్రిగా శ్రీవారి భక్తితత్వాన్ని ప్రచారం చేశారని వివరించారు. అన్నమయ్య కీర్తనల ద్వారా స్వామివారిని ఆరాధించగా, వెంగమాంగ గద్యం, పద్యం, యక్షగానాల రచన ద్వారా భక్తిని చాటుకున్నారని వివరించారు. వెంగమాంబ తెలుగులో రచించిన వేంకటాచల మహత్యం చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు.

అనంతరం ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా|| ఆకెళ్ల విభీషణ శర్మ, శ్రీకాళహస్తికి చెందిన శ్రీ ఎన్.చాముండేశ్వరరావు, చంద్రగిరికి చెందిన డా|| సంగీతం కేశవులు ప్రసంగించారు.

అంతకుముందు శ్రీవారు, తరిగొండ వెంగమాంబ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం సాహితీ సదస్సులో పాల్గొన్న పండితులను శాలువ, శ్రీవారి ప్రసాదాలతో సన్మానించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బి.రఘునాథ్, శ్రీమతి విశాలాక్ష్మి బృందం గాత్ర సంగీతసభ జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈఓ శ్రీ విజయసారథి, తరిగొండ వెంగ‌మాంబ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డా.సి.లత, సూపరింటెండెంట్ శ్రీమతి జి.నాగమణి, సీనియర్ అసిస్టెంట్ శ్రీ బి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

204th TARIGONDA VENGAMAMBA VARDHANTI UTSAVAM

 Tirupati, 15 Aug. 21: Matrusri Tarigonda Vengamamba poems heralded the glory of Lord Venkateswara in simple language for the common man to understand, said eminent pundit Acharya KG Krishnamurthy on Sunday morning.

He was participating as chief guest in the two-day literary conference organized as part of 204th Tarigonda Vengamamba vardanti utsavam at the Annamacharya Kala Mandir.

TTD Tarigonda Vengamamba project is organizing the utsavam in total adherence of covid guidelines to highlight the saint poet’s contributions as a poet, disciple, yogini, and social reformer in spreading the glory of Lord Venkateswara in her stellar Venkatachala Mahatya.

Prominent other speakers were Dr Akella Vibhishana Sharma, OSD of SV higher Vedic studies Institute, Sri N Chamundeswar Rao of Srikalahasti, Dr Sangetam Keshavulu of Chandragiri.

Earlier TTD officials paid floral tributes and garlanded the portraits of Tarigonda Vengamamba and Sri Venkateswara and thereafter felicitated pundits who participated in the literary conference with shawls and Srivari Prasadam.

As part of festivities, cultural programs were conducted in the evening including a Music concert by Annamacharya project artists Sri B Raghunath and Smt Vishalakshi.

TTD DyEO Sri Vijayasaradhi, Tarigonda Vengamamba project Coordinator Dr C Lata, superintendent Smt G Nagamani, senior assistant Sri B Narasimhulu were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI