తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణకు శాస్త్రక్తంగా అంకురార్పణ 

తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణకు శాస్త్రక్తంగా అంకురార్పణ 

తిరుపతి, 2026, ఫిబ్రవరి 12: అన్నమయ్య జిల్లా తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ  సంప్రోక్షణకు గురువారం సాయంత్రం శాస్త్రవేత్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 8.16 గంటలకు కుంభ లగ్నంలో నూతన  ధ్వజ స్తంభ ప్రతిష్ఠ, మహా పూర్ణాహుతి నిర్వహించనున్నారు. 

ఇందులో భాగంగా ఫిబ్రవరి 13వ తేదీ చతుస్థానార్చన, హోమం, జలాధివాసం, క్షీరాధివాసం తదితర వైదిక కార్యక్రమాలను చేపడుతారు. ఫిబ్రవరి 14వ తేదీ ఛాయాధివాసం, పంచశయాధివాసం, లఘు పూర్ణాహుతి జరుగనుంది.  

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.