ANKURARPANAM FOR DHWAJASTHAMBHA RENOVATION AT TARIGONDA TEMPLE _ తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirupati, 29 July 2025: As part of the renovation of the Dhwajasthambham at Sri Lakshmi Narasimha Swamy Temple in Tarigonda of Annamayya district, the ritual of prelude Ankurarpanam was held on Tuesday evening at 6 PM.
On July 30, Chatushtana Archana, installation of idols (Bimba, Kumbha, Dwara, Devata, etc.), while in the evening Nitya Havanam and Ekanta Seva.
On July 31, Morning and evening Nitya Havanams, Dhwajasthambha Abhishekam.
On August 1, Maha Poornahuti, removal rituals of the old Dhwajasthambham, Udvasana of deities and offerings.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2025 జూలై 29: అన్నమయ్య జిల్లా తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణలో భాగంగా చేపట్టిన బాలాలయంకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
జూలై 30వ తేదీ ఉదయం చతుష్టానార్చన, బింబ, కుంభ, కుండ, ద్వార, తోరణ, అండరాల, పాఠక, దేవతాప్రతిష్ఠలు, సాయంత్రం నిత్యహనన ద్వార పూజలు, ఏకాంతసేవ నిర్వహిస్తారు.
జూలై 31న ఉదయం నిత్యహవనాదులు, ధ్వజస్తంభ అభిషేకం, సాయంత్రం నిత్యహవనాదులు, ఏకాంతసేవ జరుగనున్నాయి.
ఆగస్టు 1వ తేదీన మహాపూర్ణాహుతి, ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, కుంభ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహానివేదన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


