SNAPANA TIRUMANJANAM WITH BASIL, LOTUS SEEDS AND PAVITRA MALA _ తామర గింజలు, తులసి గింజలు, పవిత్రమాలలతో వేడుకగా స్న‌ప‌న తిరుమంజ‌నం

Tirumala,20 September 2023: On the third day of the ongoing Srivari annual Brahmotsavam in Tirumala on Wednesday, the holy ritual of Snapana Tirumanjanam was held at the Ranganayakula Mandapam in Srivari temple.

The unique ceremony included the decoration of Utsava deities with Pavitra malas and garlands made from the seeds of Holy Basil and Lotus.

The grand event held at Ranganayakula Mandapam enthralled the devotees as the Utsava idols of Sri Malayappa Swami and His consorts Sridevi and Sri Bhudevi were given Abhishekam for two hours amidst Veda mantras by archaka Swamis.

The utsava idols were adorned with Almonds, Anjeer, etc. Flower and fruit decorations of the canopy were made under directions of Deputy Director of TTD Garden wing Sri Srinivasulu and all garlands were donated by Sri Rajender of Tiruppur of Tamilnadu.

TTD Chairman Sri B Karunakara Reddy, EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, temple Dyeo Sri Lokanatham and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తామర గింజలు, తులసి గింజలు, పవిత్రమాలలతో వేడుకగా స్న‌ప‌న తిరుమంజ‌నం

తిరుమల, 2023 సెప్టెంబరు 20: తామర గింజలు, తులసి గింజలు, పవిత్రమాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి స్న‌ప‌న తిరుమంజ‌నం వేడుకగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు అర్చకస్వాములు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్న‌ప‌న తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనుల‌ను చేసి వివిధ ర‌కాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, తామ‌ర‌ల‌తో వేదిక‌ను సుంద‌రంగా తీర్చిదిద్దారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం చేపట్టారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో పవిత్రమాలలతో దండలు, ఆకుపచ్చ పవిత్రమాలలతో దండలు, పసుపురంగు పట్టుదారం దండలు, తామర గింజలు, తులసి గింజలతో దండలు, గోల్డ్ గ్రేప్స్ మాలలు, బాదం మాలలు, నందివర్ధనం, రోజ్ పెటల్స్, మల్టీకలర్ రోజ్ పెటల్స్ మాలలు, కిరీటాలు, తులసి దండలు స్వామి అమ్మవార్లకు అలంకరించారు.

టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు. తమిళనాడులోని తిరుపూర్ కు చెందిన శ్రీ రాజేందర్ ఈ మాలలను విరాళంగా అందించారు.

టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.